Thursday, June 13, 2024

Kannappa first look: మంచు విష్ణు క‌న్న‌ప్ప ఫ‌స్ట్ లుక్ అదుర్స్

మంచు విష్ణు తన మార్కెట్ గురించి ఆలోచించకుండా కేవలం కథని మాత్రమే నమ్మి భారీ బడ్జట్ తో ఎపిక్ సినిమా ‘కన్నప్ప’ చేస్తున్నాడు. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, నయనతారలు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు అంటే కన్నప్ప సినిమాని మంచు విష్ణు ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. మంచు మోహన్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్న కన్నప్ప సినిమాని మహాభారతం సీరియల్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ కన్నప్ప సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

కన్నప్ప సినిమాకి రైటర్ గా మంచు విష్ణు పేరు పడుతుండడం విశేషం. స్టోరీ డెవలప్మెంట్ విషయంలో మంచు విష్ణుకి పరుచూరి గోపాలకృష్ణ, ఈశ్వర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, తోట ప్రసాద్ అండగా నిలిచారు. ఇక ఈరోజు మంచు విష్ణు పుట్టిన రోజు కావడంతో మేకర్స్ కన్నప్ప నుంచి ప్రీలుక్ పోస్టర్ ని లాంచ్ చేసారు. టైటిల్ లోగో కూడా రివీల్ చేసిన మేకర్స్, బాణాల మధ్యలో విల్లుని పట్టుకోని దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న మంచు విష్ణుని చూపించారు. ఫేస్ రివీల్ చేయకుండా డిజైన్ చేసిన పోస్టర్ లో… శివలింగం కనిపించేలా క్రియేట్ చేయడం పోస్టర్ కే హైలైట్ గా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement