Monday, June 17, 2024

Family star : ప్ర‌తి ఒక న‌డ‌క నీతో క‌ల‌సి….

విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా నుండి మరో పాట విడుదలైంది. ”మధురము కదా… ప్రతి ఒక నడక నీతో కలిసి ఇలా…” పల్లవితో సాగే ఈ గీతాన్ని హోలీ వేడుకల మధ్య విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌, నిర్మాత దిల్‌ రాజు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ పాట ఆవిష్కరణ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ ఏప్రిల్‌ 5న సినిమాను విడుదల చేస్తున్నాం. ఫ్యామిలీస్టార్‌ అంటే ఏమిటో నేను మీకు చెప్పాను. తన కుటుంబాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టేందుకు కష్టపడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టారే. దర్శకుడు పరశురామ్‌ కథ వినడంతోనే ఒకే చెప్పేశాను. ఎందుకంటే ఇది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీస్‌ కథ.

ఇందులో ఎమోషన్స్‌ అన్నీ విజయ్‌ పాత్రలో చూస్తారు. పాటలు, డైలాగ్స్‌ హీరోతో చెప్పించిన మానరిజమ్స్‌ అన్నీ రేపు థియేటర్లలో మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు ఉంటుంది. అన్నారు. విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ నేను చదువుకునే రోజుల్లో హోలీ పండుగ అంటే భయపడేవాడిని.. రంగులు పూస్తారుఅవి అలాగే ఉండిపోతాయని ఇంట్లోనే ఉండిపోయేవాడీని. ఇక్కడ మీ అందరితో కలిసి హోలీ జరుపుకుంటుంటే పండుగంటే ఇలా ఉండాలని అనిపిస్తోంది. మన లాంటి ఫ్యామిలీస్‌ నుంచి వచ్చిన ఒక వ్యక్తి కథ ఇది.
ఫ్యామిలీ గురించి ఆలోచించే వారి కథ అని చెప్పారు. హోలీ ముంబైలో చేసుకుంటుంటా. ఈసారి మీ మధ్య ఫ్యామిలీస్టార్‌ టీమ్‌తో జరుపుకోవడం సంతోషంగా ఉంది అని నటి మృణాల్‌ ఠాకూర్‌ తెలిపింది. ”మధురము కదా…” పాటకి శ్రీమణి సాహిత్యం అందించారు. శ్రేయా ఘోషల్‌ ఆలపించారు. గోపీసుందర్‌ స్వరపరిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement