Thursday, May 16, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2003 డాలర్ల మార్కు వద్ద కదలాడుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 25.27 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.155 వద్ద స్థిరంగా ఉంది. దేశీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు తాజాగా రూ.200 మేర తగ్గి రూ.55,850 మార్కు వద్ద ఉంది. ఇదే సమయంలో 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములకు రూ.220 మేర పడిపోయి రూ.60,930 మార్కు వద్ద కొనసాగుతోంది. దిల్లీలో కూడా బంగారం ధర తాజాగా పతనం అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 200 పడిపోయి రూ.56 వేల మార్కును చేరింది.

ఇక 24 క్యారెట్స్ గోల్డ్ రూ.230 తగ్గి రూ.61080 వద్ద ఉంది.బంగారం ధర పడిపోయిన సమయంలో సిల్వర్ రేటు కూడా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు స్థిరంగా రూ.81 వేల మార్కు వద్ద ఉంది. అయితే దిల్లీ మార్కెట్లో రేటు పడిపోయింది. అక్కడ కేజీ సిల్వర్ రూ.200 తగ్గి రూ.77,400 మార్కు వద్ద ట్రేడవుతోంది. ఇక బంగారం, వెండి ధరలు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. స్థానికంగా ఉండే పన్ను రేట్లు దీనిని ప్రభావితం చేస్తాయి. ఇక దిల్లీలో సాధారణంగా బంగారం రేటు ఎక్కువగా, వెండి రేటు తక్కువగా ఉంటుంది. అదే హైదరాబాద్‌లో చూస్తే గనుక గోల్డ్ రేటు కాస్త తక్కువగా, సిల్వర్ రేటు ఎక్కువగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement