Monday, May 6, 2024

‘ఆమె’ తెలంగాణ దీపిక ..ప్ర‌గ‌తికి సూచిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మహిళా రిజర్వేషన్ల పై రాద్ధాంతం నడుస్తున్న తరుణంలో జాతీయ స్థాయిలో తెలంగాణ తరహా మహిళాభ్యున్నతి పథకాలపై జోరుగా చర్చ జరుగుతోంది. తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 50శాతం, మార్కెట్‌ కమిటీల్లో 33శాతం రిజర్వేషన్లను మహళల కోసం అమలు చేస్తున్న తీరు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. సివిల్‌ పోలీస్‌ ఉద్యోగ నియామకాల్లో 2015 నుంచి మహళలకు 33 శాతం రిజర్వేషన్లను, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌పోలీసు నియా మకాల్లో 10శాతం రిజర్వేషన్లను వర్తింపజేసి అమలులోకి తీసుకొచ్చింది తెలంగాణ సర్కార్‌. దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళాభ్యున్నతి లో తెలంగాణ సర్కార్‌ వినూత్న పోకడలను అను సరిస్తూ మహిళల భుజం తట్టి ప్రోత్సహిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని పథకాలను అమలు చేస్తున్న సర్కార్‌ రాష్ట్రంలో మహిళలకూ అంతేస్థాయిలో అండగా నిలుస్తోంది. సీఎం కేసీఆర్‌ స్వయంగా రూపొందించి అమలు చేస్తున్న పథకాలు మహిళా రంగానికి ఉత్ప్రేరకాలుగా పని చేస్తున్నాయి. ఆర్థిక చేయూత నుంచి మొదలుకొని అన్ని అంశాల్లో మహిళకు ప్రాధాన్యత దక్కుతు న్నది. గర్భిణులు, బాలింతల సంక్షేమానికి ‘కేసీఆర్‌ కిట్‌’ పథకం ద్వారా లబ్ధిదారులకు మూడు విడతలుగా మొత్తం రూ.12 వేలు ప్రభుత్వం అందజేస్తున్నది. ఆడపిల్లలకు జన్మనిస్తే ప్రోత్సాహకంగా తల్లికి మరో రూ.1000 అదనం గా కలిపి రూ.13 వేలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తు న్నది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 13,90,639 మంది లబ్ధిదారులకు రూ.1261.67 కోట్లు ఖర్చు చేసింది.

కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌…
గర్భిణుల్లో రక్తహనత నివారణకు పోషకాహారం అందించే లక్ష్యంతో చేపట్టిన ”కేసిఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌” పథకంతో గర్భిణులకు విడతల వారీగా పోషకాహార కిట్‌లను సర్కార్‌ అందిస్తున్నది. గర్భిణులకు, బాలింతలకు, 6 సంవత్సరాల లోపు చిన్నారులకు సంపూర్ణ పో#హకాహారాన్ని అందించే లక్ష్యంతో 35,700 అంగన్‌వాడీల ద్వారా ఆరోగ్యలక్ష్మీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ పథకం ద్వారా 1,73,85,797 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారు. గర్భిణులు ఆస్పత్రులకు వెళ్ళిరావడానికి ”అమ్మఒడి” పేరుతో అమలు చేస్తున్న పథకం ద్వారా 22,19,504 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందగా, ప్రభుత్వం రూ.166.19 కోట్లు ఖర్చు చేసింది.

షీ టీమ్‌లతో భరోసా…
మహళల సంపూర్ణ రక్షణ కోసం, సామాజిక భద్రత కోసం దేశంలోనే ప్రప్రథమంగా షీ టీమ్‌ పేరుతో ప్రత్యేక పోలీస్‌ విభాగం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణకు కీలక చర్యలు తీసుకుంది. ఈ విధానం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది.

- Advertisement -

ఆసరాతో అండ…
నేటి వరకు ఆసరా పెన్షన్‌ పథకం ద్వారా రాష్ట్రంలోని 1,52,050 మంది ఒంటరి మ#హళలకు రూ. 1,430 కోట్లను ప్రభుత్వం పెన్షన్‌గా చెల్లించింది. భర్తను కోల్పోయి వితంతువులుగా మారిన 15,74,905 మంది మ#హళలకు రూ. 19,000.13 కోట్ల రూపాయలు, 4,80,861 మంది మహళా బీడీ కార్మికులకు రూ. 5,393.19 కోట్లను పెన్షన్‌ అందించింది.

భరోసా కేంద్రాలతో చేయూత…
జీవితంపై భరోసా కోల్పోయి, సమస్యలతో సతమతమయ్యే మహళలు, చిన్నారుల కోసం రాష్ట్రం ప్రభుత్వం భరోసా చేయూత కేంద్రాల ద్వారా పోలీసు, ఆరోగ్య శాఖ, ప్రభుత్వ న్యాయవాద సేవలు, సైకో థెరపికి కౌన్సెలింగ్‌తో పాటు వారికి, సహాయం, పునరావాసం అందిస్తున్నది. ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక చేయూతనందించి, వారి తల్లిదండ్రులకు అండగా ఉండేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం ద్వారా రూ.1,00,116లను ఆర్థిక సహాయంగా అందిస్తున్నది. ఈ పథకం ద్వారా 13,03,818 మంది లబ్ధిదారులకు రూ.11,775 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి అందిస్తున్నది. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం ప్రతి ఏటా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహళలకు బతుకమ్మ చీరలు అందిస్తున్నది. ఇప్పటివరకు మ#హళలకు 5,75,43,664 చీరెలు పంపిణీ చేసి, రూ.1,536.26 కోట్లు ఖర్చు చేశారు.
అంగన్‌వాడీ వర్కర్ల నెలవారి వేతనాలను రూ.4,000 నుండి 225 శాతం పెంచి నెలకు రూ.13,650, అంగన్‌వాడీ ##హల్పర్ల వేతనాలను రూ.2,200 నుండి పెంచి నెలకు రూ.7,800లు, ఆశా వర్కర్ల వేతనాలు నెలకు రూ.7,500 నుండి రూ.9,750లకు పెంచి వేతనాలు చెల్లిస్తున్నది.
మ#హళల భధ్రత, రక్షణ నిమిత్తం వెంటనే చర్యలు చేపట్టేందుకు ”హాక్‌ ఐ” మొబైల్‌ అప్లికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. మ హళా ఔత్సా హక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక మూలధన సహాయం, వ్యూ#హరచన, అభివృద్ధికి ”వీ #హబ్‌” ద్వారా సలహా, సూచనలు ఇస్తూ వారి స్వయం స్వావలంబనకు పెద్దపీట వేస్తోంది. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ప్రాజెక్టులో పేద మ#హళల పేరు మీద ఇండ్లను కేటాయించడం జరుగుతుండగా, ఇప్పటివరకు రూ.19,378.32 కోట్లతో 2.92 లక్షల గృహాలను మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన 1003 రెసిడెన్షియల్‌ స్కూళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్‌ కేటగిరీకి చెందిన 3,03,820 మంది బాలికలుండగా, ప్రతీ విద్యార్థి కోసం ప్రభుత్వం ఏడాదికి సగటున రూ.1,25,000లు ఖర్చు చేస్తోంది. ఈ తరహా పథకాలు ఎన్నికల ఏడాదిలో బీఆర్‌ఎస్‌కు దేశమంతటా మహిళా మణుల నుంచి అపూర్వ స్పందనకు కారణం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇతర రాష్ట్ర పథకాలతో పోల్చి చూస్తే ఏ జాతీయ పార్టీ కూడా ఈ తరహా పథకాలు, మహిళా సంక్షేమం దిశగా యోచించలేదనే అంశం దేశమంతటా ప్రస్తుటమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement