Sunday, May 19, 2024

TS | మాట తప్పిన కాంగ్రెస్‌ను బొందపెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే : కేటీఆర్‌

సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కాలేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “నువ్వు చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. కండక్టర్ నిన్ను టికెట్ డబ్బులు అడిగితే ఆరు గ్యారంటీలు అమలు కాలేదని అప్పుడు ఒప్పుకుంటాం.. లేకుంటే తాము ఇచ్చిన హామీలు అమలు అయినట్లే..” అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్‌కు కౌంట్ ఇచ్చారు.

అదే నిర్మల్ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు 2500 తమ అకౌంట్లో వేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని కోట్ చేస్తూ కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. “రేవంత్ రెడ్డి.. నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు రూ.2,500 చుపిస్తావా.. మరీ ఇన్ని పచ్చి అబద్ధాలా? తెలంగాణాలో ఉన్న 1.67 కోట్ల 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు.” అంటూ ట్వీట్ చేశారు.

“వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెస్‌ను బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే.. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం అని, చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా వైఫల్యం. కేసిఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, కళ్యాణ‌లక్ష్మి నిలిచింది, తులం బంగారం అడ్రస్ లేదు. ఫ్రీ బస్సు కూడా ఓ బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్ధాలు చేసే దుస్థితి. అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్‌కు మహిళల ఓట్లడిగే హక్కు లేదని, చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదంటూ అందరికీ తెలిసిపోయింది.” అంటూ ట్వీట్టర్ వేదికగా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement