Sunday, December 5, 2021

వ‌ర‌ద‌బాధితుల‌ను ఆదుకోండి..రాహుల్ గాంధీ పిలుపు..

ఏపీని భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. దాంతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఏపీ వ‌ర‌ద‌ల్లో మ‌ర‌ణించిన వారికి ప్ర‌గాఢ‌సానుభూతిని తెలిపారు. భారీ వరదలు ఏపీని తీవ్రంగా నష్ట పరిచాయన్నారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మీకు వీలైనంత సాయం చేయాలని ట్విట్టర్ లో కోరారు.భారీ వర్షాలు, వరదలు రాయలసీమన అతలాకుతలం చేస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా కరువు సీమలో వరదలు భయపెడుతున్నాయి. వాగులు, నదుల ప్రవాహ ధాటికి వంతెనలు కొట్టుకుపోతున్నాయి. వరదల ధాటికి ప్రజలు, మూగజీవాలు కొట్టుకుపోయాయి. వర్షాలు, వరదలుకు కారణంగా 28 మందికిపైగా మరణించారు. పలువురు గల్లంతయ్యారు. వరదల కారణంగా చిత్తూర్, నెల్లూర్, కడప, అనంతపురం జిల్లాల్లో పలు గ్రామాలు జలధిగ్బందంలో చిక్కుకుపోయాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News