Friday, April 26, 2024

లోయ‌లో ప‌డిన యాపిల్ లోడ్ లారీ-డ్రైవ‌ర్ మృతి

యాపిల్ లోడ్ తో వెళ్తోన్న లారీ అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది. హిమాచల్‌ప్ర‌దేశ్ రాష్ట్రం సోల‌న్‌ జిల్లాలోని కందఘాట్ ద‌గ్గ‌ర ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రోడ్డుపై నుంచి లోయ‌లోకి దూసుకెళ్లిన లారీ ప‌లు ప‌ల్టీలు కొడుతూ కింద‌కు వెళ్లి ఆగిపోయింది. ఈ ప్ర‌మాదంలో లారీ డ్రైవ‌ర్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు.లారీ బ‌రువుతో ఉండ‌టం, అనేక ప‌ల్టీలు కొట్ట‌డం కార‌ణంగా క్యాబిన్ పూర్తిగా నుజ్జు నుజ్జ‌య్యింది. ప్ర‌మాద‌ స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకుని.. డ్రైవ‌ర్ మృత‌దేహాన్ని వెలికి తీశారు. అనంత‌రం పోస్టుమార్టానికి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement