Wednesday, May 22, 2024

ఖరీదైన ఆడి క్యూ 7 సిరీస్ మోడల్ ని కొనుగోలు చేసిన – అదితిరావు హైద‌రి

హైద‌రాబాద్ అమ్మాయి అదితిరావు హైద‌రి ల‌గ్జ‌రీ కారుని కొనుగోలు చేసింది. ఈ మ‌ధ్య స్టార్స్ అంతా ఖ‌రీదైన కార్ల‌పై మ‌క్కువ చూపుతున్నారు. కాగా తాజాగా అదితి తన కోరిక నెరవేర్చుకుంది. ఓ లగ్జరీ కారుని ఆమె కొనుగోలు చేసింది. అత్యంత ఖరీదైన ఆడి క్యూ 7 సిరీస్ మోడల్ ని ఆమె కొనుగోలు చేశారు.దీనితో ఆడి సంస్థ అదితి కొనుగోలు చేసిన కారు పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెకు కంగ్రాట్స్ తెలిపింది. ఇంతకీ అదితి కొన్న ఈ కారు ధర ఎంతంటే.. అక్షరాలా రూ. 90 లక్షలు. బ్లూ కలర్ లో ఉన్న ఈ కారు ఆకర్షణీయంగా ఉంది. తన ఆడి కారుతో ఉన్న అదితి రావు హైదరి ఫోటోలు వైరల్ గా మారాయి. కాగా ప‌లు ప్రాజెక్టులు అదితి చేతిలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement