Tuesday, May 28, 2024

IPL eliminator | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్..

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగ‌గా నేడు మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో మూడు-నాలుగు స్థానాల్లో నిలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ – రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టస్ గెలిచిన రాజస్థాన్… బౌలింగ్ ఎంచుకుని ఆర్సీబీ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మరి కొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

జట్ల వివరాలు :

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :

ఫాఫ్ డు ప్లెసిస్ (సి), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పటీదార్, మహిపాల్ లోమ్రోర్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్), కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్.

రాజస్థాన్ రాయల్స్ :

యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (సి), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.

- Advertisement -

విజయమే లక్ష్యంగా బరిలోకి…

కాగా, ఈ మ్యాచ్‌లో గిలిచిన జట్టు రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇక ఈ సీజన్‌ను అద్భుతంగా ఆరంభించిన రాజస్తాన్‌ తొలి అర్ధ భాగంలో వరుస విజయాలతో పాయింట్స్‌ టేబుల్లో టాపర్‌గా కొనసాగింది. కానీ రెండో హాఫ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. చివరి ఐదు మ్యాచుల్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది.

మరోవైపు ఓటములతో టోర్నీను ఆరంభించి పాయింట్ల పట్టికలో అట్టడుగునా నిలిచిన ఆర్సీబీ చివరి హాఫ్‌లో మాత్రం సంచలన విజయాలతో నాకౌట్‌కు అర్హత సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. తప్పక గెలవాల్సిన మ్యాచుల్లో వరుస విజయాలు సాధించింది. ఈ క్రమంలోనే డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నైను కూడా ఆర్సీబీ ఇంటి బాట పట్టించింది. ఎలిమినేటర్‌ పోరుకు ఇరుజట్లు పూర్తిగా రెడీ అయ్యాయి. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement