Monday, June 3, 2024

West Bengal | ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు.. కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు

పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి కోల్‌కతా హైకోర్టు షాక్ ఇచ్చింది. 2010 తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ బుధవారంనాడు సంచలన తీర్పు ప్రకటించింది. 1993లో చట్టానికి విరుద్ధంగా పత్రాలు జారీ చేశారని హైకోర్టు తమ తీర్పులో స్పష్టం చేసింది.

అయితే, తమ ఆర్డర్ ప్రభావం ఇప్పటికే ఉద్యోగాలు పొంది, పథకాల ద్వారా లబ్ది పొందిన వారిపై ప్రభావం చూపబోదని పేర్కొంది. 2010కి ముందు 66 తరగతులుగా వర్గీకరించబడిన ఓబీసీల జోలికి తాము వెళ్లడం లేద‌ని, పిటిషన్‌లో వారిని సవాలు చేయలేదని ధర్మాసనం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement