Sunday, June 16, 2024

Delhi – కేంద్ర హోం శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ ..

ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాల‌యాన్ని పేల్చి వేస్తామంటూ బాంబు బెదిరింపులు వచ్చాయి. న్యూఢిల్లీ ఏరియాలోని నార్త్ బ్లాక్ పోలీస్ కంట్రోల్ రూంకు బెదిరింపు మెయిల్ వచ్చింది. హోంశాఖ భవనం వద్దకు రెండు ఫైర్ ఇంజన్లను పంపించారు. అలాగు హోం శాఖ కొలువుదీరిన నార్త్ బ్లాక్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే అనుమానాస్పదమైంది ఏదీ కనిపించలేదని స‌మాచారం.. . మధ్యాహ్నం 3 గంటల సమయంలో బెదిరింపు మెయిల్ గురించి పోలీసులకు సమాచారం అందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement