Wednesday, May 29, 2024

TS | ఏసీపీ ఉమామహేశ్వరరావుకు జూన్ 5 వరకు రిమాండ్

ఏసీపీ ఉమామహేశ్వరరావుకు నాంపల్లి కోర్టు జూన్ 5 వరకు (14 రోజుల) రిమాండ్ విధించింది. ఉమామహేశ్వరరావును పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. కొన్ని కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తుల‌ చిట్టాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల పేరిట పలు బినామీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఉమామహేశ్వరరావు ల్యాప్‌టాప్‌లో కీలక ఆధారాలు లభించాయని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement