Monday, June 10, 2024

Tollgate | జూన్ 2 నుంచి పెర‌గ‌నున్న‌ టోల్ ఛార్జీలు..

దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అథారిటీ టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు పెరగనున్నాయి. జూన్ 2 నుంచి పెంపు అమల్లోకి రానుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వెల్లడించింది. ఈ ఛార్జీలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2 న పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం NHAIని ఆదేశించింది. ఇక చివరి విడత జూన్‌ 1న ఎన్నికలు ముగియనుండ‌గా… ఎన్నికల ముగియడంతో జూన్ 2 నుంచి టోల్ ఛార్జీలను సగటున 5శాతం పెంచి వసూలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement