Thursday, May 23, 2024

వీడియో: స్మృతి మంధాన ఫెంటాస్టిక్ క్యాచ్‌

ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ ఓపెన‌ర్‌ ఓ అద్భుత క్యాచ్ పట్టింది. ఇంగ్లండ్‌తో జ‌రిగిన వన్డే మ్యాచ్‌లో బౌండ‌రీ ద‌గ్గ‌ర స్మృతి మంధాన డైవ్ చేస్తూ ప‌ట్టిన అద్భుత‌మైన క్యాచ్‌కు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. సాధార‌ణంగా మ‌హిళ‌ల క్రికెట్‌లో ఇలాంటి క‌ళ్లు చెదిరే క్యాచ్‌లు చాలా అరుదుగా క‌నిపిస్తుంటాయి. ఈ క్యాచ్ చూసిన మాజీ క్రికెట‌ర్ల‌తోపాటు ట్విట‌ర్ యూజ‌ర్లు స్మృతి మంధానాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఫ్లై స్మృతి ఫ్లై గ‌ర్ల్.. ఫెంటాస్టిక్ క్యాచ్‌ అంటూ ఆస్ట్రేలియా మాజీ వుమెన్స్ క్రికెట‌ర్ లీసా స్తాలేక‌ర్ ట్వీట్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఆమె బ్యాటింగ్‌లోనూ రాణించింది. 57 బంతుల్లో 49 ప‌రుగులు చేసి టీమ్ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించింది.

https://twitter.com/Abhicricket18/status/1411333052219854849

ఇది కూడా చదవండి: జగన్‌కు కేసీఆర్ అంటే అభిమానం: ఏపీ డిప్యూటీ సీఎం

Advertisement

తాజా వార్తలు

Advertisement