Friday, June 14, 2024

Rapido | బాలిక ఘటనపై స్పందించిన ర్యాపిడో.. ఆదుకుంటామని వెల్లడి

హైదరాబాద్‌లో బుధవారం (22వ తేదీ) మైనర్ బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై రాపిడో కంపెనీ స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. బాలికకు జరిగిన ఘటనతో తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామని ర్యాపిడో సంస్థ తెలిపింది. ఇంత దారుణం జరిగినందుకు చింతిస్తున్నామని.. బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను ఆదుకుంటామని ఆ సంస్థ తెలిపింది.

అయితే ఈ ఘటన జరిగినప్పుడు ర్యాపిడో ద్వారా ఆ భాలిక‌ ఎలాంటి రైడ్ బుక్ చేసుకోలేదని రాపిడో సంస్థ‌ స్పష్టం చేసింది. ఘటన జరిగిన సమయంలో నిందితుడు ర్యాపిడో రైడ్‌లో లేడని కంపెనీ నొక్కి చెప్పింది. కస్టమర్లతో మర్యాదగా ప్రవర్తించాలన్నదే తమ విధానమని.. తమ సంస్థ ఎలాంటి దుష్ప్రవర్తనను సహించదని తెలిపింది. తమ‌ కస్టమర్ల భద్రత కోసం, ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో భాగంగా రైడ‌ర్ల‌ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం కఠినమైన విధానాలను అవలంబిస్తామని ర్యాలిడో తెలిపింది. మొత్తంమీద, నిందితుడు ర్యాపిడో రైడ్‌లో లేడని, బాధితురాలు ఎలాంటి రైడ్‌ను బుక్ చేయలేదని సంస్థ స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement