Sunday, June 16, 2024

Singareni | ఆస్ట్రేలియా ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ తో సింగ‌రేణి సీఎండీ భేటీ

రానున్న ఐదేళ్లలో సింగరేణి సంస్థ నిర్దేశించుకున్న 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ఆధునిక మైనింగ్ టెక్నాలజీలో సహకారం అందించడంపై ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషనర్ డెనిస్ ఈటన్ తో (గురువారం) హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సింగరేణి కంపెనీ సీఎండీ ఎన్.బలరామ్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్‌.బలరాం మాట్లాడుతూ… సింగరేణిలో ప్రస్తుతం వినియోగిస్తున్న సాంకేతికత, ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉత్పత్తి, రవాణా, టర్నోవర్‌, వృద్ధిరేటు సాధించిన విషయాన్ని వివరించారు. బొగ్గు ఉత్పత్తితో పాటు వ్యాపార విస్తరణ కార్యకలాపాల్లో భాగంగా థర్మల్, సోలార్ రంగాల్లోకి కూడా విజయవంతంగా ప్రవేశించినట్లు వివరించారు. వ్యాపార విస్తరణలో భాగంగా ఇతర రంగాల్లోని అవకాశాలను క్షుణ్ణంగా అన్వేషిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన సింటార్స్ తదితర కంపెనీల నుంచి మైనింగ్, డిఫెన్స్, టెక్నికల్ అంశాల్లో సేవలు పొందారని గుర్తుచేశారు.

కాగా, సింగరేణిలో అమలవుతున్న సాంకేతికత, కంపెనీ నూతన వ్యాపార విస్తరణ చర్యలను స్వయంగా చూసేందుకు నవంబర్‌లో ఆస్ట్రేలియా బృందం సింగరేణి రీజియన్‌ను సందర్శించనుందని ఆస్ట్రేలియా కమిషనర్ డెనిస్ ఈటెన్ వివరించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఆస్ట్రేలియా కమిషనర్ తో పాటు బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ రామకృష్ణ దస్త్రాల హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement