Sunday, June 16, 2024

AP | హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. జూన్ 5 వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. అయితే, సాక్షులను ప్రభావితం చేయొద్దంటూ అభ్యర్థులకు షరతు విధించింది. వీరిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈసీకి హైకోర్టు నిర్దేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement