Wednesday, May 29, 2024

One8 | సిటీలో కోహ్లీ రెస్టారెంట్.. రేపే ప్రారంభం

హైదరాబాద్: భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన కొత్త రెస్టారెంట్ One8 కమ్యూన్‌ను రేపు (24న) హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. కాగా, దీనికి సంబంధించి విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ చిన్న వీడియోను పోస్ట్ చేశాడు. హైదరాబాద్‌లో One8 కమ్యూన్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అద్భుతమైన మెనూతో ఆహార ప్రియులను ఏకం చేయడమే లక్ష్యం… రేపు One8 ప్రారంభోత్సవానికి వచ్చి కమ్యూనికేషన్ స్ఫూర్తిని అనుభవించాలని కోరాడు.

కాగా, ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పూణే, కోల్‌కతా, బెంగుళూరు వంటి అనేక ప్రాంతాల్లో వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెస్టారెంట్ హైదరాబాద్‌కు రాబోతోంది. ఈ One8 కమ్యూన్ నాలెడ్జ్ సిటీ, హైటెక్ సిటీ ప్రాంతంలోని RMZ ది లాఫ్ట్‌లో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement