Thursday, May 2, 2024

జగన్‌కు కేసీఆర్ అంటే అభిమానం: ఏపీ డిప్యూటీ సీఎం

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ, ఏపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు రాష్ట్రాలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జల వివాదం ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాష్టాల సీఎంలకు ఒకరిపై మరొకరికి అభిమానం ఉందని నారాయణస్వామి వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రజలకు నీరిచ్చి ఆదుకోవాలనే తపన కేసీఆర్‌కు ఉందని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం బాధాకరమని అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం భారత్, పాకిస్థాన్‌ల మధ్య వివాదం కాదన్నారు. తెలుగు ప్రజలంతా ఒకతల్లి బిడ్డలని, కొందరు వ్యక్తులు ఇద్దరు సీఎంల మధ్య సఖ్యతను చెడగొట్టేందుకు పూనుకున్నారని ఆరోపించారు.

గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమలకు వచ్చినప్పుడు రాయలసీమ రైతులను ఆదుకోవాలంటే నీళ్లివ్వాలని తపనపడ్డారని గుర్తుచేశారు. అంతేకాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కేసీఆర్ అంటే చాలా అభిమానమని తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం వద్దని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. నీరు పుష్కలంగా ఉన్నపుడు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చునని తెలిపారు. జల వివాదంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి కూర్చుని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలని డిప్యూటీ సీఎం కోరారు.

ఇది కూడా చదవండి: జగన్ కేసుల్లో నిందితులకు హైకోర్టు షాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement