Friday, June 14, 2024

T 20 World Cup – పాక్ – ఇండియా మ్యాచ్… టికెట్ ధ‌ర జెస్ట్ రూ.17 ల‌క్ష‌లే

వ‌చ్చే నెల‌లో అమెరికాలో జ‌ర‌గ‌నున్న టీ 20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇండియా, పాకిస్థాన్ టీమ్ ల మ‌ధ్య స‌మ‌రం జ‌ర‌గ‌నున్న‌ది. జూన్ 9వ తేదీన జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్‌కు ఫుల్ క్రేజీ ఉంది. ఇక ఆ మ్యాచ్ టికెట్ల‌ను భారీ ధ‌ర‌కు అమ్మేస్తున్నారు. ఒక్కొక్క టికెట్‌ను 20 వేల డాల‌ర్లు అంటే సుమారు 17 ల‌క్ష‌ల‌కు ఒక టికెట్‌ను అమ్ముతున్నారు. అధిక ధ‌ర‌ల‌కు టికెట్ల‌ను అమ్మ‌డాన్ని ఖండిస్తూ ఐపీఎల్ మాజీ చైర్మెన్ ల‌లిత్ మోదీ త‌న ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్టు చేశారు.


న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియంలో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌కు భారీ ధ‌ర‌కు టికెట్లు అమ్ముతున్నార‌ని, క్రికెట్ ఆట‌ను ప్రోత్స‌హిస్తున్నారా లేక ఆ క్రీడ‌ను అడ్డుకుంటున్నారా అని ల‌లిత్ మోదీ ప్ర‌శ్నించారు. డైమండ్ క్ల‌బ్‌కు చెందిన టికెట్ల‌ను 20 వేల డాల‌ర్ల‌కు అమ్మ‌డం షాక్‌కు గురిచేస్తోంద‌న్నారు. క్రికెట్‌ను ప్రోత్స‌హించాల‌న్న ఉద్దేశంతో అమెరికాలో వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను నిర్వ‌హిస్తున్నార‌ని, కానీ లాభాలు ఆర్జించేందుకు కాదు అని ల‌లిత్ మోదీ తెలిపారు.

- Advertisement -

https://twitter.com/LalitKModi/status/1793422859832017012

Advertisement

తాజా వార్తలు

Advertisement