Friday, May 31, 2024

Fake seeds – రూ.30 ల‌క్ష‌ల విలువైన న‌కిలీ విత్తనాలు ప‌ట్టివేత ..

అక్రమంగా తరలిస్తున్న నకిలీ విత్తనాలను ఎస్‌వోటీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నకిలీ విత్తనాలతో పాటు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జీనోమ్‌వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది..
కర్ణాటక నుంచి మంచిర్యాలకు వాహనంలో అక్రమంగా నకిలీ విత్తనాలను తరలి స్తున్నారనే సమాచారం మేరకు ఎస్‌వోటీ పోలీసులు జీనోమ్‌ వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తుర్కపల్లి రాజీవ్‌ రహదారిపై తనిఖీలు చేపట్టారు. సుమారు రూ.30 లక్షల విలువ చేసే విత్తనాలతో పాటు రవాణ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement