Sunday, December 8, 2024

Khushi Kapoor : ఖుషీగా వ‌చ్చేస్తున్న శ్రీదేవి చిన్న కూతురు…

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు, పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. బాలీవుడ్‌ లో ఇప్పటికే పలు సినిమాలు చేసిన జాన్వీ కపూర్‌ మరో వైపు తెలుగు లో దేవర సినిమాలో నటిస్తుంది. అదే కాకుండా బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా రూపొందబోతున్న సినిమా లో కూడా జాన్వీ కపూర్‌ నటిస్తుంది.

జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా వరుస సినిమాలతో దూసుకు పోతూ ఉంటే శ్రీదేవి మరో కూతురు ఖుషి కపూర్ మాత్రం ఇంకా ఆఫర్లు వెతుక్కునే పనిలోనే ఉంది. ఈ మధ్య కాలంలో కమర్షియల్‌ అందాల హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో ఫోటోలను షేర్‌ చేస్తుంది.

- Advertisement -

ఆకట్టుకునే అందం తో పాటు, మంచి ఫిజిక్ ఖుషి కపూర్ సొంతం అనే విషయం ఆమె ఫోటోలు మరియు వీడియోలు చూస్తే అర్థం అవుతుంది. తాజాగా మరోసారి అందమైన ఫోటో షూట్‌ తో ఖుషి కపూర్ సర్‌ప్రైజ్‌ చేసింది. ప్రముఖ మ్యాగజైన్ కోసం ఖుషి కపూర్ బ్లాక్ లో మెరిసింది. సాధారణంగా ముద్దుగుమ్మలు బ్లాక్‌ అండ్‌ వైట్‌ డ్రెస్ ల్లో చాలా అందంగా కనిపిస్తారు. గతంలో వైట్‌ డ్రెస్ లో కన్నుల విందు చేసిన జాన్వీ కపూర్‌ ఇప్పుడు బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ఆకట్టుకునే అందంతో రాబోయే రోజుల్లో స్టార్‌ హీరోయిన్ అవ్వడం ఖాయం అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే హీరోయిన్ గా ఒక సినిమా ను చేసింది. అంతకు ముందు షార్ట్‌ ఫిల్మ్స్ చేసింది. అంతే కాకుండా సినిమా ఇండస్ట్రీలో టెక్నీషియన్‌ గా కూడా ఖుషి కపూర్ చేసింది. హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు చేస్తుంది. రాబోయే రెండేళ్లలో ఆమె సౌత్‌ లో కూడా నటించే అవకాశాలు ఉన్నాయట.

Advertisement

తాజా వార్తలు

Advertisement