Friday, April 26, 2024

ఆయూష్ కన్వీనర్ కోటా సీట్లకు రేపు వెబ్ ఆప్షన్లు..

వరంగల్, (ప్రభ న్యూస్ ప్రతినిధి) : ఆయూష్ అడిషనల్ మాప్ ఆప్ కౌన్సిలింగ్ కు కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూజీ ఆయూష్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

యూనివర్సిటీ పరిధిలోని ఆయూష్ కళాశాలల్లో బీఎఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎన్ వైసీ, బీయూఎంఎస్, కోర్సుల్లో ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి అర్హులైన విద్యార్థులు ఈ నెల 10వ తేది ఉదయం 6గంటల నుండి అదే రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొంది. ఇప్పటికే అఖిలభారత కోటా లో ఆయూష్ కోర్సుల్లో చేరిన కాళోజి యూనివర్సిటీ ఎంబీబీఎస్, బీడిఎస్ కోర్సుల్లో సీటు పొందిన విద్యార్థులతో పాటు మొదటి విడతలో సీటు పొంది చేరని విద్యార్థులు ఈ వెబ్ కౌన్సిలింగ్ కు అనర్హులు గా పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement