Wednesday, May 8, 2024

టీడీపీ కోసం యంగ్ టైగర్ పనిచేయాలి… గోరంట్ల

భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సోమవారం రాజమండ్రిలో టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో గోరంట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించాయి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ 40 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని ఇప్పుడు వైసీపీ దమనకాండను ఎదుర్కొంటోందని చెప్పారు.

గ్రౌండ్ రియాల్టీస్ ప్రకారం టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతుందని స్పష్టంచేశారు గోరెంట్ల. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కార్యకర్తలంతా కూడా టీడీపీ బలోపేతం కోసం పనిచేయాలని చెప్పారు. ఒకపక్క రాష్ట్రం అప్పులకుప్పగా మారితే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వైజాగ్‌లో రాజధాని ఎలా నిర్మిస్తారని ముఖ్యమంత్రి జగన్ పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు ఎక్కుపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement