Friday, May 17, 2024

టీకాలు ఇవ్వండి.. చమురు తీసుకోండి

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వెనిజులా అధ్యక్షుడు కొత్త తరహా దౌత్యానికి తెర లేపారు. తమ వద్ద విరివిగా లభించే చమురుతో వ్యాక్సిన్లు పొందేందుకు వస్తుమార్పిడి పద్ధతిని నికోలస్ మదురో ప్రకటించారు. తమ దేశంలో చమురు విరివిగా ఉత్పత్తి అవుతోందని.. అయితే తమ ఉత్పత్తిలో కొంత భాగాన్ని కరోనా వ్యాక్సిన్ పొందడానికి ఉపయోగించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తమకు వ్యాక్సిన్లు ఇచ్చే వారికి క్రూడాయిల్‌ను సరఫరా చేస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ దేశ చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించడంతో భారత్ వంటి దేశాలు అక్కడి నుంచి చమురును పొందడం లేదు. ఈ దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఇప్పటివరకు అక్కడ 1.5 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 1,500 మంది కరోనాతో చనిపోయారు. బ్రెజిల్ వేరియంట్ కరోనా వైరస్ ఎక్కువగా సోకుతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement