Wednesday, May 1, 2024

భర్తతో కాజల్ హోలీ సంబరాలు

దక్షిణ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన త‌ర్వాత తొలి హోలీ పండుగ జ‌రుపుకుంది ఈ ముద్దుగమ్మ. కొత్త పెళ్లి కూతురు కాజల్ అగర్వాల్ ఇంట్లో ఈ ఏడాది హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. హోలీ వేడుకల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కాజల్.. అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపింది.

ప్రేమించి పెళ్లిచేసుకున్న కాజల్- గౌతమ్ జోడీ పెళ్లైన తర్వాత మొదటిసారి హోలీ వేడుకలో ఎంజాయ్ చేశారు. ఒకరికొకరు రంగులు పూసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. హోలీ పండుగని చాలా పద్ధతిగా చేసుకున్న కాజల్.. తన భర్తతో సరదాగా గడిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ తనే స్వయంగా షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. రంగులు పూసుకున్న చందమామ లుక్ నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది.

https://twitter.com/MsKajalAggarwal/status/1376429125359955969

కాగా, కాజల్ అగర్వాల్.. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. రీసెంట్ గా ‘మోసగాళ్లు’ సినిమాతో అలరించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న.. ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తోంది. అంతేకాకుండా.. ప్రవీణ్ సత్తారు, అక్కినేని నాగార్జున కాంబోలో రాబోతున్న సినిమాలోను నటించనుంది ఈ ముద్దుగుమ్మ. 

Advertisement

తాజా వార్తలు

Advertisement