Thursday, May 16, 2024

Team India | సెల‌క్ట‌ర్లపై అంబ‌టి గ‌రంగ‌రం.. రింకూ చేసిన త‌ప్పేమిటి !!

అమెరికా, వెస్టిండీస్ వేదికగా ప్రారంభం జూన్ 1 నుంచి కానున్న టీ20 వరల్డ్ కప్ 2024 కోసం బీసీసీఐ 5 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. అయితే తుది జట్టులో రింకూ సింగ్‌ను స్టాండ్‌బైగా ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో భారత జట్టు సెలక్టర్లపై టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. విధ్వంసకర ఫినిషర్, యువ సంచలనం రింకూ సింగ్‌కు అవకాశం ఇవ్వనందుకు సెలెక్టర్లను తప్పుబట్టాడు. ప్రపంచకప్‌కు ఎంపికైన ఆటగాళ్లలో రింకూ సింగ్ లాగా చివర్లో బ్యాటింగ్‌లోకు వచ్చి దూకుడుగా ఆడే సత్తా ఎవరికి ఉందని ప్రశ్నించింది.

రింకూ సింగ్‌ను ఎంపిక చేయకపోవడం ద్వారా క్రికెట్ సెన్స్, ఎబిలిటీ కంటే అంకెలే ముఖ్యమని అర్థమవుతోందని అన్నాడు. డెత్ ఓవర్లలో పరిస్థితులను లెక్కచేయకుండా కష్టపడి ఆడగల సత్తా రింకూ సింగ్‌కు ఉందని, జడేజా మినహా ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లెవరూ రింకూ సింగ్‌లా ఆడలేదని గుర్తు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement