Tuesday, July 23, 2024

DC vs LSG | కీలక మ్యాచ్‌.. ఢిల్లీ చేతిలో లక్నో చిత్తు

అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లక్నో జేయింట్స్‌తో తలపడిన ఢిల్లీ… 19 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 208 పరుగులు చేసింది.

209 పరుగుల భారీ లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ తడబడింది. 44 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి లక్నో టాపార్డర్ అంతా కుప్పకూలింది. నికోలాస్ పూరన్ (27 బంతుల్లో 61), అర్షద్ ఖాన్ ( 33 బంతుల్లో 58) అర్థ సెంచరీలతో చెలరేగారు. అయితే మిగిలిన వారు విఫలమవ్వడంతో లక్నోకు ఓటమి తప్పలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement