Wednesday, May 8, 2024

ఉత్తమ సేవలకు సత్యపాల్‌ రెడ్డికి లీడర్‌షిప్‌ అవార్డు ..

మంచిర్యాల రూరల్‌, కోవిడ్‌ సమయంలో హైటెక్‌సిటి లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడిగా చేసిన సేవలకు గాను లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు సత్యపాల్‌రెడ్డి ఇంటర్నేషనల్‌ లయన్‌ ప్రెసిడెంట్‌ నుండి లీడర్‌షిప్‌ అవార్డును హైదరాబాద్‌లో అందుకున్నారు. 2019-20 సంవత్సరానికి గాను లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైటెక్‌సిటి అధ్యక్షునిగా తన ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాల్లో అధికసంఖ్యలో క్లబ్‌ సభ్యులను భాగస్వామ్యం చేస్తూ సేవా కార్యక్రమాలను చేసినందుకు గుర్తింపుగా లయన్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ సునీల్‌కుమార్‌, లయన్స్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ విజయ సమక్షంలో అవార్డును అందుకున్నారు. సత్యపాల్‌రెడ్డికి అవార్డు రావడం పట్ల సీనియర్‌ లయన్స్‌క్లబ్‌ సభ్యులు మదుసుధన్‌రెడ్డి, హన్మంతరావులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement