Sunday, May 19, 2024

Sam Pitroda | కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ పదవీకి శ్యామ్ పిట్రోడా రాజీనామా..!

కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయన రాజీనామాను ఆమోదించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ దీనిపై సమాచారం ఇచ్చారు. తన ఇష్టానుసారం శామ్ పిట్రోడా ఈ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం తెలిపారు.

ఇటీవ‌ల‌ పిట్రోడా చేసినటువంటి వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. భారతదేశంలోని భిన్నత్వంపై శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. భారత్ లో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. తూర్పు భారతీయులు చైనీస్ లాగా, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్ ప్రజలలా కనిపిస్తారని చెప్పారు. అదేవిధంగా ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయుల మాదిరిగా కనిపిస్తారని శ్యామ్ పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సైతం ఎక్స్ లో స్పందించారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

ఇవాళ వరంగల్ సభలో, ఏపీ రాజంపేట సభలో ప్రధాని నరేంద్ర మోడీ శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలను ప్రస్తావించడం గమనార్హం. శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా ఉంటారని గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి అంటున్నారని విమర్శించారు. దీన్ని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సీఎంలు సమర్థిస్తారా ? అని ప్రశ్నించారు. మహారాష్ట్రలోని థాకరే వారసులుగా చెప్పుకునే వాళ్లు దీన్ని అంగీకరిస్తారా ? అని మోదీ నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement