Tuesday, July 23, 2024

AP | ఓటమి భయంతోనే టీడీపీ కుట్రపూరిత ప్రచారం : పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓడిపోతుందని తెలిసిపోవడంతోనే ఆ పార్టీ నాయకులు తమపై తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విమర్శించారు. ఆదివారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడుతూ… లోకేశ్ ట్విట్టర్ లో మాపై తప్పుడు పోస్టులు పెడుతున్నాడన్నారు.

ఐదేళ్లు మంత్రిగా పనిచేసి టికెట్ తెచ్చుకోలేని దేవినేని ఉమా కూడా మాట్లాడుతున్నాడన్నారు. 2013 నుంచి ఆఫ్రికాలో మేము వ్యాపారం చేస్తున్నామని, ఇక్కడ నుంచి వాహనాలు, మెషినరీ అక్కడకు పంపిస్తున్నామని చెబుతూ మొదటి విడత గా 20 బండ్లు బాంబే పోర్ట్ నుంచి షిప్ లో పంపిస్తునామని చెప్పారు.

అక్కడ చేస్తున్న ఫెరో మగనీస్, సిలికాన్ మైనింగ్ ప్రాజెక్ట్ ల అవసరాలకోసం స్వర్ణ మెటల్స్ కు 100 వెహికల్స్ అవసరం ఉంది, ఇక్కడ నుంచి వాహనాలు పంపిస్తున్నామన్నారు. దీనిపై తాము విదేశాలకు పారిపోతున్నామని , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాలకు పారిపోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

దీనీపై పచ్చ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. 4వ తేది ఎన్నికలు ఫలితాలు తర్వాత వాళ్ళు ఎక్కడ ముఖాలు పెట్టుకుంటారో చూడాలని,తాము చేసిన సంక్షేమ పథకాలు వల్లే పోలింగ్ పెరిగిందని అంటూ 4వ తేదీ రిజల్ట్ తర్వాత అన్ని మాట్లాడదామన్నారు.

పోలింగ్ శాతం పెరగటానికి మహిళలే కారణమని ఐ పాక్ టీమ్ ఇదే చెప్పిందని, తమకు అనుకూల ఓటు 7 నుంచి 8 శాతం పెరిగిందని చెప్పారు. అందరి కృషివల్లే మేము ఎక్కువ సీట్లు ఘన విజయం సాధిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ధీమా వ్యక్తం చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement