Saturday, June 22, 2024

ముక్తినిచ్చు భక్తి పథములు!

”మోక్ష సాధన సామాగ్య్రాం భక్తిరేవ గరీయసీ”. మోక్ష సాధనా మార్గాలలో భక్తి మార్గం సర్వ శ్రేష్ఠమైనది అంటుంది ఆదిశంకరా చార్యుల వారి గ్రంథం ‘వివేక చూడామణి’. భక్తి ఒక యోగమం టున్నది భగవద్గీత. భక్తిని తొమ్మిది విధాలుగా శాస్త్రాలు సూచిం చాయి. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అనేవి నవ విధ భక్తి మార్గాలని శ్రీమద్భాగవతం నిర్వచించింది.
”తను #హృద్భాషల సఖ్యమున్‌, శ్రవణమున్‌, దాసత్వమున్‌, వందనా
ర్చనముల్‌, సేవయు, నాత్మలో నెరుకయున్‌, సంకీర్తనల్‌, చింతనం
బను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్‌ #హరిన్‌ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమం చు తలతున్‌ సత్యంబు దైత్యోత్తమా!”
అని పేర్కొంటూ, వినడం వలన పరీక్షిత్తు, కీర్తనం వలన శుక మహర్షి, స్మరణం వల్ల ప్రహ్లాదుడు, పాద సేవనం వలన లక్ష్మీదేవి, అర్చ నం వలన పృథు మహారాజు, వందనం చేత అక్రూరుడు, దాస్యం వలన హనుమంతుడు, సఖ్యం వలన అర్జునుడు, ఆత్మ నివేదనం వలన బలి చక్ర వర్తి తరించిన గాథలను కూడా భాగవతం ఉదహరించింది.
ఇక భక్తులు నాలుగు రకాలు అంటుంది భగవద్గీత.
”చతుర్విధా భజం తే మాం జనా స్సుకతినోర్జున
ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ”. (అధ్యాయం- 7, శ్లో. 16)
ఆర్తులు, జిజ్ఞాసువులు, కోరికలు కలవారు, జ్ఞానులు, అని భక్తులు నా లుగు విధాలుగా ఉన్నారు. వీరందరూ సుకృతులు (పుణ్యాత్ములు) అని గీతాచార్యుని వచనము.
ఆర్తులు : ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు స#హజంగానే మనుషులకు దేవు డు జ్ఞాపకం వస్తాడు. ఆ ఆపద నుండి గట్టెక్కడం కోసం ఏవేవో మొక్కుబ డులు, నోములు, వ్రతాలు, దీక్షలు చేపట్టడం ఒకవిధంగా అవకాశవాదమే అయినా ఎంతో ఆర్తితో తనను సేవించే భక్తులను అక్కున చేర్చుకొని తన వారిగా చేసుకోవడం ఆ దయామయుని లీల.
కబీర్‌ అంటాడు- ”దుఖ్‌మే సుమిరన్‌ సబ్‌ కరై, సుఖ్‌ మే కరై న కోయి, జో సుఖ్‌ మే సుమిరన్‌ కరై తో దుఖ్‌ కా హ #హూయ్‌”. దు:ఖాలలో దేవుని స్మరించడం, సుఖాలలో ఆయనను విస్మరించడం మానవ నైజం. సుఖా లలో కూడా దైవ నామస్మరణ చేస్తూంటే అస లు దు:ఖాలే కలుగవు కదా! అని అర్థం. అయి నా ఆర్తులైన భక్తుల ఆర్తనాదాలను వినిపించు కొని కరుణించే ఆ దేవదేవుని దృష్టిలో ఆర్తులు కూడా తన భక్తులే.
అర్థార్థులు: సిరి సంపదలు, వస్తు వా#హనాలు, సుఖవంతము, విలాసవంతమైన జీవనము కోరి భగవంతుని పూజించేవాడు అర్థార్థి. ఇ లాంటి వారు తమకు ఇంత లాభం వస్తే ఇంత శాతం దేవుని #హుండీలో వేస్తామని దేవునికి మాట ఇచ్చి, ఆ మాటకు కట్టుబడతారు కూ డా! దేవునికి సువర్ణాభ రణాలు, ఖరీదైన కానుకలు సమర్పిస్తారు. అర్థార్థు లు భౌతిక ప్రాపంచిక సుఖాలను మాత్రమే వాంఛి స్తారు. ఆపదలు, అనారోగ్యాలు, భయాందోళన లు, దు:ఖాలు తొలగాలని ఆర్తులు దేవుణ్ణి కోరితే, సిరి సంపదలు భోగభాగ్యాలు, సుఖసంతోషాలను ఆశించి పూజించే వారు అర్థార్థులు. ఆర్తులు, అర్థా ర్థులు అనే రెండు రకాల వారూ ”సకామ భక్తులు”.
జిజ్ఞాసువులు: భగవంతుని గురించి తెలుసుకోడాని కి అ#హర్నిశలూ ప్రయత్నం చేస్తూ ఉండే వ్యక్తులను జిజ్ఞాసువులు అనవచ్చు. మనలో అనేకమందిమి దేహాత్మ భావనలో ఉం టాము. కానీ మనలోనే ఉన్న పరమాత్మను దర్శించుకోడానికి అంతర్ము ఖులమవుదామని ప్రయత్నించం. భౌతిక విషయాలు, ధన సంపాదన, విషయాసక్తి పైననే మనసును లగ్నం చేస్తాం. జిజ్ఞాసువుకు దేహచింతన పై కంటే భగవంతుని దర్శించాలనే తపన, ఆసక్తి ఉంటాయి. అనుక్షణం దైవ చింతన పైననే దృష్టి నిలపడానికి, వైరాగ్య అభ్యాసాలు అలవరచుకొనే ప్ర యత్నం చేయడానికి పూర్వజన్మ వాసనలు తోడ్పడతాయని పెద్దలంటారు.
జ్ఞానులు : వేదశాస్త్రాలు అభ్యసిస్తూ, పురాణాలు అధ్యయనం చేస్తూ, దైవ సంబంధిత ప్రవచనాలు వింటూ, విషయ వాంఛలను దూరం చేసుకొం

టూ, ఆత్మయే నిత్యము, సత్యము అని గాఢంగా నమ్మి, దేవునికీ జీవునికీ తేడాలేదని భావించి, చరాచరములన్నిటి పట్ల సమదృష్టి కలిగి, నిష్కామ కర్మలనాచరిస్తూ, అన్నింటినీ పరమాత్మ దృష్టితో చూస్తూ ఉండేవాడు జ్ఞాని.
స#హజంగా ప్రతి వ్యక్తి తొలుత కష్టాలు తొలగించ మని దేవుణ్ణి ప్రార్థించే ఆర్తునిగా, తర్వాత ప్రాపంచిక సుఖాలు, ధనధాన్యాలు కోరుకొనే అర్థార్థిగా, పిమ్మట భౌతికమైనవన్నీ అశాశ్వతాలని గు ర్తించి శాశ్వతానందం పొందాలని మా ర్గం వెతకడానికి ప్రయత్నించే జిజ్ఞా సువుగా, ఆఖరున జీవాత్మ పర మాత్మల ఏకత్వం గ్ర#హంచి, మనసును ఆత్మలో లీనం చేసి ఆత్మానందాన్ని పొందే జ్ఞానిలా పరి ణామం చెందుతాడు. ఇలా పరిణామం చెందడానికి అ భ్యాస వైరాగ్యాల సాధన చాలా అవసరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement