Monday, May 20, 2024

SRH vs LSG | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో..

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు (బుధవారం) జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ – లక్నో సూపర్ జేయింట్స్ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక హైదరాబాద్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. ఇక రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ కి చేరాలంటే ఇక్కడ గెలవడం చాలా కీలకంగా మారింది.దీంతో సన్ రైజర్స్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ రసవత్తరంగా మారనుంది.

జట్ల వివరాలు :

లక్నో సూపర్ జెయింట్స్ :

లోకేష్ రాహుల్ (c & wk), క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ రవిసింగ్ ఠాకూర్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ :

ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, విజయకాంత్ వియాస్కాంత్, T నటరాజన్.

- Advertisement -

ఇంపాక్ట్ ప్లేయర్స్

లక్నో సూపర్ జెయింట్స్: దేవదత్ పడిక్కల్, యుధ్వీర్ సింగ్ చరక్, అమిత్ మిశ్రా, మణిమారన్ సిద్ధార్థ్, అష్టన్ టర్నర్

సన్‌రైజర్స్ హైదరాబాద్: గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్

ఎస్​ఆర్​హెచ్, ల‌క్నోల‌కు అగ్ని ప‌రీక్ష‌..

హైదరాబాద్ టాప్ ఆర్డర్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రమ్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ వీరందరూ ఆడితే స్కోరు జెట్ స్పీడ్ తో పరుగులెడుతోంది. వీరిలో ముగ్గురు అయిపోయినా కథ కంచికి చేరిపోతోంది. బౌలింగ్ కూడా పర్వాలేదనిపించేలా వేస్తున్నారు.

ఇక, లక్నో సూపర్ జెయింట్స్ విషయానికి వస్తే… కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో కూల్ గా ముందడుగు వేస్తోంది. పెద్ద అంచనాల్లేకుండా బాగా ఆడుతోంది. బౌలింగ్, బ్యాటింగ్ అన్నింటా బాగానే ఉంది. ఓపెనర్లు డికాక్, రాహుల్ ఉన్నారు. దేవదత్ పడిక్కల్ ఒకటి ఆడితే, రెండు వదిలేస్తున్నాడు. స్టోనిస్, పూరన్ ఇంకా టచ్ లోకి రావాలి. బౌలింగ్ విషయానికి వస్తే కృనాల్ పాండ్యా, మయాంక్ యాదవ్, మార్కస్ స్టోనిస్, నవీన్ ఉల్ హక్ వీరందరూ ఉన్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే రెండు సమఉజ్జీల మధ్య పోరులో ఎవరు గెలుస్తారు? ఎవరు ప్లే అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంటారో వేచిచూడాల్సిందే.

పొంచి ఉన్న‌వ‌రుణ గండం..

సాఫీగా సాగుతున్న ఐపీఎల్‌-17కు వర్షం ముప్పు పొంచి ఉంది. నిన్న (మంగళవారం) సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురవడంతో ఉప్పల్‌ స్టేడియం తడిసి ముద్దయ్యింది. దీంతో ప్రధాన పిచ్‌పై గ్రౌండ్‌ సిబ్బంది కవర్లు కప్పి ఉంచారు. అవుట్‌ ఫీల్డ్‌ మొత్తం వాన నీటితో నిండిపోయింది. నగరంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో నేటి మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement