Wednesday, May 15, 2024

T20 World Cup | ఆఫ్ఘానిస్థాన్ కెప్టెన్‌గా రషీద్ ఖాన్.. తుది జట్టు ఇదే

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. సెలక్టర్లు (బుధవారం) సీనియర్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. ఆరుగురు ఆల్‌రౌండర్లు తుది జట్టులోకి చోటు కల్పించారు.

అఫ్గనిస్థాన్ స్క్వాడ్ : ర‌హ్మ‌నుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్ర‌హీం జ‌ద్రాన్, అజ్మ‌తుల్లా ఒమ‌ర్జాయ్‌, న‌జీబుల్లా జ‌ద్రాన్, మ‌హ‌మ్మ‌ద్ ఇషాక్, మ‌హ‌మ్మ‌ద్ న‌బీ, గుల్బ‌దిన్ న‌యీబ్, క‌రిమ్ జ‌న‌త్, ర‌షీద్ ఖాన్(కెప్టెన్), న‌న్‌గ్యాల్ ఖ‌రొటి, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మ‌ద్, న‌వీన్ ఉల్ హ‌క్, ఫ‌జ‌ల్ హ‌క్ ఫారూఖీ, ఫ‌రీద్ అహ్మ‌ద్ మాలిక్.

రిజర్వ్ ఆట‌గాళ్లు : సెదిక్ అట‌ల్, హ‌జ్ర‌తుల్లా జ‌జాయ్, స‌లీం స‌ఫీ.

ఇక‌, వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ జూన్ 1న ప్రారంభంకానుండగా.. త‌మ‌ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ జూన్ 4న ఉగాండాతో తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement