Wednesday, July 24, 2024

పరమాత్ముని…శాంతి ఆకాంక్ష

పంచమ వేదమయిన మహాభార త చరిత్రలో ధర్మాన్ని స్థాపించ డానికి శ్రీకృష్ణ భగవానుడు కురుక్షే త్ర సంగ్రామం చేయించాడని అందరూ భావిస్తారు. కాని భగవానుడు రక్తపాతం జరగకుండా ప్రతి సందర్భంలోను సర్వ ప్రయత్నం చేసాడు. మానవజన్మను ప్రసాదించిన పరమాత్మ ముక్తిథామం చేర డానికి ప్రతి ఒక్క జీవికి సహకరిస్తాడు. తగిన అవకాశాలను కల్పిస్తాడు. కానీ ప్రారబ్ధము ప్రకారము వాటిని ఉపయోగించుకొనే వివేకులు తక్కు వ. అదేవిధంగా కురుక్షేత్ర యుద్ధమును ఆపడానికి ధృతరాష్ట్రునికి, దుర్యోధనునికి అనేక విధాల నచ్చ చెప్పాడు. పాండవుల సందేశము ను వినిపించడానికి సాక్షాత్తు భగవానుడే రాయబారం చేసాడు. పర మాత్మ ఆకాంక్ష శాంతి మాత్రమే!
సభా భవనానికి విచ్చేసిన శ్రీకృష్ణునికి సర్వతోభద్రమనే ఉన్నత సువర్ణ సింహాసనాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేయించాడు ధృతరాష్ట్రు డు. అప్పటికే ఋషులు విచ్చేసి అంతరిక్షంలో నిలిచి ఉండడాన్ని భగ వానుడు గమనించాడు. శ్రీకృష్ణుని ఆదేశంతో బీష్ముడు వారికి కూడా ఉచితాసనాలను ఏర్పాటు చేయించాడు. సభాభవనమంతా శ్రీకృ ష్ణ పరమాత్మను చూడడానికి వచ్చిన వారితో క్రిక్కిరిసి పోయింది.
భగవానుడు మొట్టమొదట దుర్యోధనునితో…
నాహం కామాన్న సంరమ్భాన్న ద్వేషాన్నార్థ కారణాత్‌
న హేతువాదాల్లో భాద్‌ వా ధర్మం జహ్యాం కథంచన
నేను కామముచే గాని, క్రోధముచే గాని, ద్వేషముచే గాని, స్వా ర్థ వశమున గాని, మోసముచే గాని, లోభముచే గాని, ఏ ప్రకారము గానైనా ధర్మమును వదలజాలను. తరువాత ధృతరాష్ట్ర మహారాజు ను, సభను ఉద్దేశించి చెబుతూ, క్షత్రియవీరుల, సైన్య సంహారం జర గకుండానే కౌరవ పాండవుల మధ్య సంధి కుదరాలని ప్రకటించా డు. కౌరవులు ధర్మార్థాల పట్ల విముఖులై క్రూర పురుషుల వలె ప్రవ ర్తిస్తున్నారు. దుర్యోధనుడు లోభమనే భూతం మీద సవారీ చేస్తు న్నాడు. కురు వంశాన్ని రక్షించుకోవాలంటే సంధి తప్పదు. కావున మీ కుమారుల ను అదుపు చేయండి. పాండవులను చేరదీసి వారి రక్షణలో ధర్మా న్ని కాపాడుతూ ఈ సమస్త సామ్రాజ్యాన్ని చక్కగా పరిపాలించండి. కౌరవ పాండవులు కలసి ఉంటే సమస్త లోకాలను జయించి పాలించగలరు.
యుద్ధము వలన గొప్ప విధ్వంసం తప్ప ప్రయోజ నం లేదు. లోకాన్ని రక్షించుకోవాలంటే శాంతిసంధి ఇరువురి మధ్య చేయించండి. మీ నియమాన్ని రాజాజ్ఞగా శిరసావహిం చి పన్నెండేళ్ళు అరణ్యవా సం, ఒక సంవత్సరం అజ్ఞాత వాసం చేసిన పాండవులపై పితృవాత్సల్యం చూపిస్తారని ఆశిస్తున్నారు.
సారపు ధర్మమున్‌ విమల సత్యము
పాపము చేత బొంకుచే
పారము పొందలేక చెడబారిన
దైనయవస్థ దక్షులె
వ్వారలుపేక్ష సేసి రది, వారల చేటగుగాని
ధర్మని స్తారకమయ్యె సత్యశుభదాయ
కమయ్యును దైవముండెడిన్‌
ధర్మజ్ఞులు, ఋషి పుంగవులు ఉన్న సభలో ఎటువంటి అనుచి త సంభాషణ చేయకూడదు. సభాసదుల కనుసన్నలలో అధర్మం చేత ధర్మం. అసత్యం చేత సత్యం నశించిపోతే భవిష్యత్తులో వారం దరూ నశిస్తారు. పాండవులు ధర్మమును అనుసరించి నిశ్శబ్దంగా ఉండిపోయారు. కావున పాండవుల ధర్మమైన రాజ్యభాగాన్ని ఇచ్చి వారిని కలుపుకొని రాజ్యపాలన చేయండి. పాండవులు మీ సేవకు సిద్ధంగా ఉన్నారు. మృత్యుపాశం నుండి ప్రజలను, క్షత్రియ లోకా న్ని కాపాడండి. శ్రీకృష్ణ భగవానునితో బాటు వ్యాసుడు, భీష్ముడు, నారదుడు మొదలగు వారు దుర్యోధనునికి నచ్చచెప్పారు.
అర్థం, ధర్మం, కామం వీటిలో బుద్ధిమంతుడు ధర్మానికి అను కూలుడుగాను, మధ్యముడు అర్థానికి, మూర్ఖుడు కలహాల హేతు వైన కామానికి బానిసవుతాడు. ఇంద్రియ వశుడైన పరిపాలకుడు ధర్మాన్ని వీడతాడు. కుయుక్తులతో నశించిపోతాడు. అర్థకామాల ను వివేకంతో వినియోగించుకునేవారు మొదట ధర్మాన్ని ఆచరిం చాలి. ధర్మమే త్రివర్గ ప్రాప్తికి ఏకమాత్రమని ధర్మజ్ఞులు నిర్ధారించా రు. కాబట్టి దుర్జనుల సాంగత్యంవీడి పాండవులతో స్నేహం చేస్తే సర్వ శుభాలు కలుగుతాయి. ఈవిధంగా శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రా మాన్ని నిలపాలని ప్రయత్నించా డు. పరమాత్మఎల్లవేళలా అవకా శాలను కల్పిస్తాడు. వాటిని సకా లంలో అందుకోగలిగితేనే సుఖశాం తులు లభిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement