Thursday, May 30, 2024

శ్వేతాంబర్‌జైన్‌ మందిర్‌

తెలుగు రాష్ట్రాలలోనే ఏకైక విశిష్ట దేవాలయం తెలంగా ణాలోని ‘కొలనుపాక’ గ్రా మంలో వుంది. ఈ దేవాల యం ‘శ్వేతాంబర్‌ జైన్‌ మం దిర్‌’ పేరిట అత్యంత ప్రఖ్యాతి గాంచి, ప ర్యాటకులను విశే షంగా ఆకర్షిస్తోంది. భారతదేశంలో జైన మతస్తుల సంఖ్య సుమారుగా 42 లక్షలు. వీరికొరకు ఏర్పడిన అరుదయిన దేవాలయాలు అతి స్వల్ప సంఖ్యలో వుంటాయి. వాటిల్లో ఒకటయిన కొల నుపాకలో నెలకొని వున్న ఈ దేవాలయం ఎంతో అద్భుతంగా వుంటుంది. ఈ దేవాలయం రెండువేల సంవత్సరాల నాటిది. ఈ దేవాలయం ప్రవేశ ద్వారం ‘కోట’ ద్వారాన్ని తలపిస్తుంది. రెండు నల్లని ఏనుగులు లోపలకు ఆహ్వానిస్తున్నట్లు వుంటాయి.
ఈ ‘జైన్‌ మందిర్‌’ నిర్మాణానికి ఢోల్‌పూర్‌ రాయిని రాజస్తాన్‌ నుంచి తెప్పించారు. ఈ మందిర్‌లోనున్న ఆలయంలో ఆదినా థుడు, మహావీరుడు, నేమనాథుడు వంటి ఆరాధ్యుల విగ్రహాలు ప్రధాన ఆకర్షణ. ఆలయంలో ఎడమ వేపున తీర్థంకరులు కొలువు దీరి వుంటారు. ఈ విగ్రహాలను బంగారం, పాలరాయి, నల్లరాతి తో చేసి ప్రతిష్ఠించారు. క్రింద నేలంతా పాలరాయితో మెరుస్తూ వుంటుంది. సమీపంలో వున్న మరో దేవాలయంలో నలుగురు తీర్థంకరులు ప్రత్యేకంగా కొలువుదీరి వుంటారు.
ప్రధాన ఆలయంలో ఎత్తయిన మహావీరుని విగ్రహం ‘ఫిరో జా’ రాతితో నిర్మించబడింది. ఇటువంటి అత్యద్భుతమైన ప్రతిమ భారతదేశంలో మరెక్కడా లేదు. మరో విగ్రహం మాణిక్యదేవ ఋషభ దేవునిది కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆలయంలో జైనుల పండుగ దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వుంటారు. ఈ జైనమందిరం, జై పుణ్యక్షేత్రాల్లో అతి పురాతనమైన ది. రాజస్తాన్‌, గుజరాత్‌ల నుండి వచ్చిన 150 మంది నైపుణ్యం కలిగిన కళాకారుల చేతులలో మందిరం రూపుదిద్దబడింది. ఈ ఆలయంలో మూడు ప్రధాన విగ్రహాలు లార్డ్‌ నేమినాథ్‌, లార్డ్‌ రిష భ్‌, లార్డ్‌ మహావీర్‌. జైన్‌ తీర్థంకరులలో మొదటి వ్యక్తి లార్డ్‌ రిషభ్‌.
జైన పుణ్యక్షేత్రాల్లో ఈ కొలనుపాకలోని ఆలయం అతి పురా తనమైనది. శ్వేతాంబర జైనుల ముఖ్యమైన తీర్థయాత్రా స్థలం ఇది. ఈ ఆలయానికి జైన మతస్తులు రాజస్తాన్‌ వంటి సుదూర ప్రాంతాల నుండి వచ్చి సందర్శిస్తూ వుంటారు. ఈ కొలనుపాకకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసుకొని కూడా వందల సంఖ్యలో జైన మతస్తులు విచ్చేస్తారు. ఈ ఆలయంలో జైనమతస్తుల కొరకు ప్రత్యేక విడిది కేంద్రాలు ఏర్పాటు చేయబడి వున్నాయి. వీరి ఆహార రుచులు కూడా భిన్నంగా వుంటాయి. అన్ని వసతులు, ఆహార తయారీ మొత్తం ఈ ఆలయంలోనే వుంటుంది.
జైనమందిరం ఒక శిల్పకళా అద్భుతం. ఈ ఆలయాన్ని అన్ని మతాల వారూ సందర్శిస్తూ వుంటారు. ఇదొక పర్యాటక అద్భు తం. ఈ ఆలయంలో భారీ కాంస్య గంట ప్రధాన ఆకర్షణ. ఒకే ఒక్క జెడ్‌ రాతితో రూపుదిద్దబడిన మహావీర భారీ విగ్రహం సందర్శకు లను అమితంగా ఆకర్షిస్తుంది. ఇదొక చారిత్రక ప్రాధాన్యత కలిగిన మతపరమయిన ప్రదేశం.
ఈ ఆలయాన్ని ‘కులపక్జీ’ మందిర్‌ అని కూడా పరిగణిస్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ‘కొలనుపాక’ గ్రామం వుంది.
హైదరాబాద్‌ నుంచి 65కి.మీ. దూరంలో కొలనుపాక వుం టుంది. హైదరాబాద్‌-వరంగల్‌ రహదారిపైనున్న ఆలేరు చేరుకొ ని, అక్కడి నుంచి సుమారు 10కి.మీ దూరంలోనున్న కొలనుపాక చేరుకోవాలి. తప్పనిసరిగా సందర్శించవలసిన ఆలయం కొలను పాక శ్వేతాంబర్‌ జైన్‌ మందిర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement