Saturday, May 25, 2024

Ahmadabad :ఆకాశాన్నంటిన విమాన ఛార్జీలు.. పైపైకి ఫైవ్ స్టార్ హోటల్ టారిఫ్ ధరలు

భారత్, ఆసీస్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం వద్ద అన్ని రహదారులు వాహనాల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. పండుగల సీజన్, అందులోనూ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కారణంగా నగరంలోకి భారీగా రద్దీ నెలకొంది. నగరంలో విమాన ఛార్జీలు, హోటల్ టారిఫ్‌లు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.

ప్రధానంగా ఢిల్లీ, ముంబై నుంచి అహ్మదాబాద్‌కి విమానంలో ప్రయాణించడానికి చివరి నిమిషంలో బుక్ చేసుకున్నప్పటికీ సాధారణంగా రూ. 8వేల నుంచి రూ. 10వేల వరకు ఖర్చు అవుతుంది. ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్స్ ప్రకారం.. నవంబర్ 18 నుంచి 20 మధ్య తేదీల్లో ఈ విమాన ఛార్జీలు 300శాతం పెంపుతో వరుసగా రూ. 31వేల నుంచి రూ. 43వేలు వరకు పెరిగాయి. ఇతర నగరాల నుంచి విమాన ఛార్జీలు కూడా సాధారణ రోజులతో పోలిస్తే.. కనీసం 150 నుంచి 200 శాతం పెరిగాయి. ఫైవ్ స్టార్ హోటళ్లకే కాకుండా ఇతర త్రీ స్టార్, ఫోర్ స్టార్ హోటళ్లకు కూడా భారీ డిమాండ్‌ పెరిగింది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో రాబోయే రెండు రోజుల్లో నాన్-షెడ్యూల్డ్ చార్టర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య 100కి చేరుకునే అవకాశం ఉందని సమీప వర్గాలు తెలిపాయి. గుజరాత్ హోటళ్లు ఇప్పటికే 80శాతం ఆక్యుపెన్సీని ఆక్రమించాయని సూచిస్తున్నాయి. టారిఫ్‌లు ఎక్కువగా ఉన్నప్పటికీ, బుకింగ్ చేసుకునేందుకు ఆఖరి నిమిషంలోనూ కస్టమర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement