Monday, June 24, 2024

భక్తాగ్రేసరుడు హనుమంతుడు

ప్రపంచంలో ఎవరికి లేనన్ని గొప్ప సుగుణాలు, మహోన్నత వ్యక్తిత్వం, సక ల విద్యాపారంగత్వం, సునిశిత పరిశీలన, పరిశోధన, కార్యతూరత, సమయ స్ఫూర్తి, లక్ష్యసాధన, ఏకాగ్రత, ధైర్యం, స్థైర్యం, ఆత్వవిశ్వాసం, మధురభాషణ, కోరికలు లేకపోవడం, అధికార వాంఛరహతం, ఆజన్మ బ్రహ్మచర్యం, సూక్ష్మగ్రాహ, ఏకసంతాగ్రాహ, వినయం, విధేయత, గౌరవం, విశ్వాస పాత్రత, శ్రీరామునిపై అచంచల భక్తి, నమ్మినబంటుగా… ఇలా ఎన్నో, ఎన్నెన్నో… ఆంజనేయ స్వామి సొంతం, అందుకే ఆయన లోకా రాధకుడయ్యారు.
”భగవంతునితో సమానంగా పూజలు” దేవుని (శ్రీరాముని)తో సమానంగా పూజలందుకుంటున్న భక్తాగ్రేస రుడు హనుమ. ఎక్కడ రామాలయం ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే మారుతిలేని రామాలయం ఉండదు. హనుమంతుడిని తన సోదరుడన్నాడు శ్రీరాముడు.
అసలు శ్రీరామునితో హనుమకు పరి చయం అయిన ఆ ఘట్టమే ఓ అపూర్వ సదృ శం. అరణ్యవాసంలో అదృశ్యమైన సీతను అన్వేషిస్తూ శ్రీరామ, లక్షణులు ఋష్యమూ కం చేరుకున్నారు. వానరరాజు వాలి భయం తో తన వానర సైన్యంతో అక్కడ తలదాచుకుం టున్న సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి తనను చంపడానికి తన అన్న వాలి పంపిన మనుషులేమో నని గజగజ పణికిపోయారు. దీంతో సుగ్రీవుని మంత్రి అయిన హనుమం తుడు అతనికి ధైర్యం చెప్పి కామరూపుడైన (కోరిన రూపం ధరించేవాడు) ఆయన యతి రూపంతో రామల క్ష్మణుల వద్దకు వచ్చాడు. అతన్ని చూసి శ్రీరాముడు హనుమంతుడిగా గుర్తించాడు. తన నెవరైతే గుర్తుపడతారో ఆయనే తన స్వామి, తన ప్రభువుగా స్వీకరించాలన్న నిర్ణయం ఉంది. ఆవిధంగా అప్పుడే శ్రీరామ చంద్రమూర్తిని హనుమ తన స్వామిగా, తాను ఆయన బంటుగా నిర్ణయించుకున్నాడు. తొలి పరిచయంలోనే హనుమ శ్రీరాముని ప్రశంసలందుకున్నారు. ఎదుటివారిని మంత్రముగ్ధులను చేసే మధురభాషణ, వాక్చాతుర్యం, నడక, నడత, అన్నీ శ్రీరామున్ని ఆకట్టుకున్నాయి. హనుమ సకల విద్యా పారంగతుడని, నవవ్యాకరణ పండితుడని, చతుర్వేదాల అధ్యయనుడు… సత్పురుషు డని తెలుసుకున్నాడు. దూత అంటే ఇలా ఉండాలి. ఏ కార్యానైనా సాధించి, చక్కదిద్దే సమర్థతకలవాడని భావించాడు రాముడు.
”సుగ్రీవునితో మైత్రీ బంధానికి దోహదకారి ఈ క్రమంలో శ్రీరామునికి సుగ్రీవునితో మైత్రిబంధాన్ని ఏర్పరచాడు హనుమ. వానర రాజు వాలి తన తమ్ముడైన సుగ్రీవున్ని బల గర్వంతో అతని భార్య రుమను అవహరించి తరిమి కొట్టాడనీ…. ఇక్కడకు రాకుం డా వాలికి మతంగ హర్షి శాపం ఉన్నందున ఋష్య మూకము ను తమకు రక్షణ కోటగా చేసుకొని సుగ్రీవుడితో పాటు తామంతా ఆవాసం ఉంటున్నామ”నీ చెబుతాడు హనుమ. అలా శ్రీరాముని పరిచయమైన హనుమ సాటిలేని మేటి బల, పరాక్రమవంతుడు అయినప్పటికీ శ్రీరాముడి సేవే తన జీవిత పరమావధిగా గడిపా డు. హృదయాన్నే శ్రీరామ మందిరం చేసుకొని ఆరాధించాడు. అందుకే భక్తులందరిలో హనుమ భక్తాగ్రేసరుడయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement