Thursday, May 30, 2024

ఆత్మ గీత…భగవద్గీత!

ఆత్మస్థితి ఒక ఖగోళ భాండంగానే మన మనసులలో మెదలుతుంటుంది. కారణం మనం సైకిక్‌ బీయింగ్స్‌ కాబట్టి. అంటే మనం మానసిక జీవులం. శాశ్వత చిరు నామాలో మనం ఆత్మజీవులమే అయినా తాత్కాలిక చిరునా మాతో బ్రతికి బట్ట కట్టేది మానసిక జీవులుగానే. ఆత్మ జీవులు గానే విశ్వసంచారం చేస్తుంటాం. అనేక జన్మలుగా ఆవిష్కరింప బడుతుంటాం. అన్నంత మాత్రాన అన్ని జన్మలు మానవజన్మ లు కావు. మనం చెప్పుకునే ‘పునరపి జననం.. పునరపి మర ణం’ సిద్ధాంతం కేవలం మానవ జన్మకే పరిమితం కాదు. అయి నా, మనం మానసిక జీవులం కాబట్టి, మనకు మనంగా మన ఆలోచనలతో సృష్టిలో ఉన్నతాసనం వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఈ మానవ అస్తిత్వాన్నే కోరుకుంటూ పునర్జన్మలను మాన వ ప్రాంగణాలకే పరిమితం చేసుకుంటున్నాం. మానవ జన్మతో పరిపూర్ణులం కాలేక పాప పుణ్య వివేకంతో మానవ రూపానికే కట్టుబడిపోతున్నాం. మనకు తెలిసిన లోకాలకు మనకు తెలీని లోకాలకు మధ్య దేవలోకాన్ని నిలిపి ఆ దేవలోకాన్నే కంచెగా చేసుకుని, ఆ కంచెను దాట సా#హసించక దాన్నే రక్షా కవచంగా చేసుకుని కుదించుకుపోతున్నాం. కుంచించుకు పోతున్నాం.
గట్టు లోపల ఉన్నదే ప్రపంచం అనుకుంటే ఎలా? గట్టు దాటితేనే కదా అసలు గుట్టు వెలుగులోకి వచ్చేది.
అందుకే గట్టు మానవ దే#హం కాదు.. ఆ దేహాన్ని చూడగల ఆత్మది. ఆత్మ అంతరన్వేషణ కొంతే.. మిగిలినదంతా ఆధ్యాత్మ అన్వేషణ. దానికి మనం పెట్టుకున్న పేరు ‘ఆధ్యాత్మిక అన్వేషణ’. దైహకంగా మనం మానసిక జీవులం.. అంటే కోరికల పుట్టలం. ఆశాజీవులం. కోరికకు కాలమానం లేదు. చేరవలసిన గమ్యం అంటూ లేదు. నిలబడ్డ చోటు నుండి సైతం ప్రయాణించగలదు. ప్రయాణిస్తూ, ప్రయాణిస్తూ అలమటిస్తూ ఆరాలు పడ్తూ ఎగసిపడటం దాని నైజం. ఇలా భౌతికంగా అంటే ప్రాపంచికం గా తచ్చాడుతున్నంత కాలం కోరిక వేదనగానే వెల్లడవుతుం టుంది. దీనికి అక్షర రూపమే గీతలోని అర్జున విషాద యోగం.
ఏదో ఒక మలుపులో అధ్యాత్మక వెలుగు ప్రసరిస్తే తప్ప వేద నామయ వెతుకులాట నెమ్మదించదు. నెమ్మదిస్తే తప్ప దేవతా ర#హస్యాలు, దివ్యత్వం అందిరావు. ఆ ర#హస్యాలు అందితే తప్ప ఆత్మ దైవిక ప్రాంగణాలను దాటలేదు. ఆ దివ్య ప్రాం గణాలను దాటితే తప్ప విశ్వ ప్రాంగణాలను చేరలేదు. ఆది స్థితి చేరలేదు.
ఇలా వివేచిస్తుంటే మానవత్వం, దివ్యత్వం, విశ్వ త్వం సంగమమే ఆత్మ అని స్పష్టమౌతుంది. అసలు మన సుకే పరిమితమైన ఆత్మ మానవత్వంలోనే సంచరిస్తుం టుంది. అంతరంగానికి చేరుకోగల ఆత్మ దివ్యత్వంతో వి#హరిస్తుంటుంది. దేహాన్ని, మనసును, అంతరంగా న్ని దాటిన ఆత్మ విశ్వ ప్రాంగణాలలో ప్రాణ భూతమ వుతుంది. అందుకే మన మానవత్వాన్ని ‘డిజైర్‌ సోల్‌’ అని అంటుంది. కోరికలకు అతీతమై నది ట్రూ సోల్‌!
భగవద్గీతలోని అర్జునాత్మ డిజైర్‌ సోల్‌. కృష్ణా త్మ ట్రూ సోల్‌. మనం సైకిక్‌ బీయింగ్‌గా మసలుతు న్నంత కాలం మనది డిజైర్‌ సోల్‌గానే పరిభ్రమిస్తుం టుంది. అయితే ఆత్మ తనలోని దివ్యత్వాన్ని పసిగ డితే తప్ప ఈ దేహానికి, మనసుకు అతీతమై ప్రయా ణించలేదు. దేహానికి, మనసుకు అతీత మైతే తప్ప పూర్ణం కాలేం. మంచికి పెద్ద పీట వేయాలన్నా కేవ లం దేవతా రూపం సరిపోదు. మానవ రూపమే భూమిక కావాలి. గీతలోని కృష్ణుడు ఇలా మాన వ అవతారానికి వచ్చిన దివ్య మూర్తినే! మొత్తా నికి కోరికలతో అలమటించినవాడు అర్జునుడై తే, ఆత్మ సంయమంతో కోరికలకు అతీతమైన వాడు కృష్ణుడు. అందుకే కృష్ణ గీత అయిన భగవద్గీత ఆత్మగీతనే.

Advertisement

తాజా వార్తలు

Advertisement