Monday, June 3, 2024

Breaking: ఛ‌త్తీస్ గ‌ఢ్ లో భారీ పేలుడు.. 17మంది మృతి

ఛ‌త్తీస్ గ‌ఢ్ లో భారీ పేలుడు సంభ‌వించ‌డంతో 17మంది మృతిచెంద‌గా, ప‌లువురికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. బెమెత‌ర జిల్లాలోని గ‌న్ పౌడ‌ర్ త‌యారీ కేంద్రంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఒక్క‌సారిగా పేలుడు ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డంతో 17మంది అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌డంతో పాటు ప‌లువురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

పేలుడు ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో భారీ శబ్ధానికి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రెస్క్యూటీమ్స్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని రాయిపూర్‌లోని మెహ్‌కార ఆసుపత్రికి తరలించారు. బెమెతర కలెక్టర్, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement