Saturday, December 7, 2024

ADB: రెండు లారీలు ఢీ… ఒకరి మృతి…

తాండూరు, జులై 24 (ప్రభ న్యూస్) : తాండూర్ మండల కేంద్రంలోని శనివారం సంత ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందారు. ఇవాళ తెల్ల‌వారుజామున‌ ఐబి తాండూర్ ఫ్లైఓవర్ వద్ద నాగపూర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న లారీని మ‌రో లారీ ఢీకొట్టింది.

ఆ లారీని నాగపూర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న లారీ వెనుక నుంచి ఢీకొట్ట‌డంతో డ్రైవర్ ఎండీ అన్వర్ తీవ్ర గాయాలతో అక్కడిక‌క్క‌డే మృతి చెందాడు. అన్వర్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement