Thursday, May 30, 2024

Suicide: రైలుప‌ట్టాల‌పై ముగిసిన ప్రేమ‌క‌థ‌

వరంగల్, మే 25 : ఓ ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లాలో చోటుచేసుకుంది. రైలు కింద పడి యువతి మృతిచెందిన ఘటన వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మం సారధి నగర్ కు చెందిన ఐలపోగు సుష్మ (17) అనే యువతి, వరంగల్ కాశిబుగ్గకు చెందిన చెన్నకేశవ అనే యువకుడు శుక్రవారం సాయంత్రం వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఏడు మోరీల వద్ద నవజీవన్ ఎక్స్ ప్రెస్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

తీవ్ర గాయాలపాలైన యువతి స్పాట్ లోనే మృతిచెందగా.. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలించారు. తీవ్రగాయాల పాలైన యువకుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతురాలు పై ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది. బంధువులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. వారు వచ్చిన తర్వాత ఏ కారణం చేత‌ ఆత్మహత్యకు పాల్పడ్డారనే పూర్తి వివరాలు తెలియ జేస్తామని ఐ.ఓ ఎం.మల్లయ్య, ఎస్ఐ, ఆర్పీ, వరంగల్ రైల్వే పోలీసులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement