Saturday, June 15, 2024

MBNR : ఈదురుగాలుల బీభత్సం… ధ్వంసమైన జిన్నింగ్ మిల్

అచ్చంపేట, ప్రభ న్యూస్ః అచ్చంపేట మండలంలోని పరిసర గ్రామాలలో కనివిని ఎరగని రీతిలో వీచిన బలమైన ఈదురు గాలులు తీవ్రమైన నష్టాలను మిగిల్చింది. వీచిన బలమైన గాలులు, వర్షాల ధాటికి భారీ వృక్షాలు సైతం నేల‌కొరిగాయి.

- Advertisement -

అచ్చంపేట మండలంలోని చెన్నారం గేటు వద్ద ఈదురు గాలుల ధాటికి శ్రీ లలిత ఉమామహేశ్వరి జిన్నింగ్ మిల్ రాప్టర్లు, రేకులు కొట్టుకుపోయి దాదాపు పూర్తిగా ధ్వంస‌మైంది. దాదాపు 10 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింద‌ని మిల్లు యాజమాన్యం అయిన తుమ్మల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్ర‌భుత్వం స్పందించి త‌మ‌ను ఆదుకోవాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement