Thursday, December 5, 2024

Flood Flow – జూరాల ప్రాజెక్టుకు వరద పోటు – 42 గేట్లు ఎత్తివేత

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – మహబూబ్నగర్: గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.06 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది..

జలాశయం నుంచి 1.97 లక్షల క్యూక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో స్పిల్వే ద్వారా 1.69 లక్షల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 24,201 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్కు 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్కు 1300 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిట్టం 318.51 మీటర్లు కాగా ఇప్పుడు 316.71 మీటర్ల వద్ద నీరు ఉన్నది. అదేవిధంగా ప్రాజెక్టులో 9.65 టీఎంసీల నీటి నిల్వకుగాను ప్రస్తుతం 6.23 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement