Tuesday, December 3, 2024

Flood Flow – తుంగభద్ర రిజ‌ర్వాయ‌ర్ 33 గేట్లు ఎత్తివేత

క‌ర్నూలు – తుంగభద్ర జలాశయంకు ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుకుంటుంది. దీంతో జలాశయం చెందిన 33 క్రస్ట్ గేట్ల ద్వారా 98 166 క్యూసెక్కుల నీటిని దిగివన నదిలోకి వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగుల గాను, ప్రస్తుతం 1631.99 అడుగులుగా ఉంది. నీటి నిల్వలు 105.734 టీఎంసీలకు గాను 98166 క్యూసెక్కుల ప్రవాహం డ్యాంకు ఎగువ నుంచి వస్తుంది. ఇక జలాశయం కింద ఉన్న వివిధ కాలువలకు 8156 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది మొత్తంగా తుంగభద్ర జలాశయం నుంచ 98166 దిగువన నదిలోకి వెళ్తుండడం విశేషం.

సుంకేసుల జలాశయం నుంచి నీటి విడుదల..
తుంగభద్ర జలాశయంకు భారీ వరద వస్తుండడంతో, డ్యాం చెందిన 33 గేట్లను ఎత్తి దిగువకు దాదాపు రెండు లక్షల క్యూసెక్కులన్నిటిని వదులుతున్నారు. గురువారం నుంచే తుంగభద్ర నుంచి నీరుని వదులుతుండగా.. ఆ నీరు నేటి రాత్రి కి గాని, శనివారం ఉదయం సుంకేసులకు చేరుకునే అవకాశం ఉంది. నదిలోకి ఎగువ నుంచి భారీగా నీటి ప్రవాహం వస్తుండడంతో.. ప్రస్తుతం సుంకేసులకు చెందిన నాలుగు గేట్లను పైకెత్తి 11వేల క్యూసెక్కుల నీరు పైగా దిగువ నదిలోకి వదులుతున్నారు.. దీంతో పరవళ్ళు తొక్కుతూ ఆ నీరు శ్రీశైలం చేరుకుంటుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement