Thursday, May 30, 2024

ATP: ఈదురు గాలులతో కూడిన వర్షం… నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు

తాడిపత్రి టౌన్, మే 25 (ప్రభ న్యూస్) : అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షంతో పలు విద్యుత్ స్తంభాలతో పాటు పచ్చని చెట్లు సైతం కూకటి వేర్లతో నేలకొరగాయి. పట్టణంలో శుక్రవారం రాత్రి సంభవించిన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షంతో టైలర్స్ కాలనీ, సంజీవనగర్, యల్లనూరు రోడ్డు తదితర కాలనీలలో అకాల వర్షానికి పచ్చని చెట్లు నేలకొరిగాయి. అంతేకాకుండా విద్యుత్ స్తంభాలు సైతం విరిగి పోవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం కలిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement