Thursday, May 30, 2024

TS : గుట్ట‌కు పోటెత్తిన భ‌క్త‌జ‌నం

వేసవి సెలవులు ముగుస్తున్న నేప‌థ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భ‌క్తులు పోటేత్తుతున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూ కాంప్లెక్స్‌లో నిరీక్షిస్తున్నారు.ధర్మ దర్శనానికి 3 గంటలు.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది.

- Advertisement -

కొండపైన వాహనాలతో కిటకిటలాడుతున్నాయి పార్కింగ్ స్థలాలు. వెహికల్ పార్కింగ్ లేకపోవడంతో కొండ పైకి వెళ్లే వాహనాలు కొండ కిందనే గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. కొండకింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరిణి ప్రాంగణం, వాహనాల పార్కింగ్, వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement