Thursday, May 30, 2024

AP: అల్లూరి జిల్లాలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లాలో మావోయిస్టుల భారీ డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప‌న‌స‌లబంద అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వ‌హించారు. భ‌ద్ర‌తా బ‌ల‌గాలే టార్గెట్ గా మావోయిస్టులు సిద్ధం చేసిన డంప్ ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఆరు మందుపాత‌ర‌లు, రెండు మైన్స్, మేకులు, 150 మీట‌ర్ల వైర్లు, విప్ల‌వ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 13 మంది మావోయిస్టుల ఫోటోల‌ను పోలీసులు విడుద‌ల చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement