Wednesday, May 22, 2024

బీహార్ డిప్యూటీ సీఎం ఇంటి ముందు వరద నీరు

బీహార్‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల ధాటికి ప‌లు ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇళ్ల‌ల్లోకి నీరు చేరుతోంది. రోడ్ల‌పైనే నీళ్లు నిలిచిపోతుండడంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాట్నాలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం రేణుదేవి నివాస సముదాయం వద్ద వరద నీరు చేరింది. రేణు దేవి ఇంటి‌ముందు ఒకటిన్నర అడుగుల మేర నీరు నిలిచింది. పాట్నాలో భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో ఈ ప‌రిస్థితి ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement