Friday, May 3, 2024

గరుడ రామ్ న్యూ లుక్@ మహాసముద్రం

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ సిద్ధార్థ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం మహా సముద్రం. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, అతిథి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేజిఎఫ్ గరుడ రామ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కాగా తాజాగా ఆయన పాత్రకు సంబంధించి ధనుంజయ్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ధనంజయ్ గా గరుడ రామ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారట ఈ సినిమాలో. కొత్తగా రిలీజ్ అయిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement